Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి మాస్ లుక్ తో కనిపించనున్న సాయితేజ్

  • 'ప్రతిరోజూ పండగే'తో హిట్ అందుకున్న తేజూ 
  • సెట్స్ పై 'సోలో బ్రతుకే సో బెటర్'
  • దేవ కట్టాతో తదుపరి సినిమా 
సాయితేజ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రతిరోజూ పండగే' .. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత సినిమాగా 'సోలో బ్రతుకే సో బెటర్' నిర్మితమవుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా షూటింగు పూర్తికాగానే సాయితేజ్ చేసే మరో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

దేవ కట్టా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే దేవ కట్టా ఒక కథను సిద్ధం చేశాడట. ఈ సినిమాలో తేజు మాస్ లుక్ తోనే కనిపించనున్నాడని అంటున్నారు. మొదటి నుంచి కూడా తేజూకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన చేసిన సినిమాలకి మాస్ ఆడియన్స్ నుంచి పడే మార్కులే ఎక్కువ. అందువలన తేజూ మరో మాస్ మూవీకి రెడీ అవుతుండటం ఆయన అభిమానులను ఖుషీ చేసే విషయమే.
Sai Tej
Deva Katta

More Telugu News